బతుకమ్మ పండుగ: బహరైన్ లో పూల సంబురం

By telugu team  |  First Published Oct 6, 2019, 7:39 PM IST

బహెరైన్ లో పూల సంబురం మిన్నంటింది. బతుకమ్మ సంబురాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. ఆడుతూ పాడుతూ తమ స్థానిక సంస్కృతిని గుర్తు చేసుకున్నారు.


బహెరైన్: తెలంగాణ పూల పండుగ బహరైన్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ  ఆధ్వర్యంలో బహరైన్ లోని అదిలియాలో జరిగిన  బతుకమ్మ సంబురాలు తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి మోహినీ భాటియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చెల్లంశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ - గల్ఫ్  లో ఉన్నప్పటికీ తెలంగాణ ఆడబిడ్డలు మన పండుగలు జరుపుకోవడం, సంస్కృతిని కాపాడుకోవడం గొప్ప విశయం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రవాస తెలంగాణ కార్మికులు బలవన్మరణాల బాట పట్టొద్దని విజ్ఞప్తి చేసారు. మనస్థైర్యం కోల్పోవద్దని కోరారు. 

Latest Videos

అనంతరం ఆడబిడ్డలు తాము పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి సాంప్రదాయ పాటలను పాడి ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి బహరైన్ అధ్యక్షులు బర్కుంట బాబూరావు, నాయకులు నాగశ్రీనివాస్, ప్రభాకర్, విజయవర్దన్, విజయ్ షిండే, అరుణ్, రవీందర్, నజీర్, సందీప్, నరేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

click me!