తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి ప్రమాదవశాత్తు కెనడాలో మరణించాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి ప్రమాదవశాత్తు కెనడాలో మరణించాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఉన్నత విద్య కోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజా రెడ్డి 2018లో కెనడాకు వెళ్లాడు. ఈ నెల 29వ తేదీన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ సమాచారాన్ని తేజా రెడ్డి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కెనడా ఆసుపత్రి మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపర్చారు.
undefined
ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కెనడా ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని తేజా రెడ్డి స్నేహితులు కోరుతున్నారు.
ఉన్నత చదువులతో స్వదేశానికి తిరిగి వస్తాడని భావించిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కొడుకు మృతదేహన్ని రప్పించేందుకు ఆ కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లన పలువురు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు. మృతదేహలను స్వగ్రామాలకు రప్పించుకొనేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడేవారు.