అమెరికాలో సిక్కు కుటుంబం కాల్చి వేత: నలుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 30, 2019, 08:35 AM IST
అమెరికాలో సిక్కు కుటుంబం కాల్చి వేత: నలుగురు దుర్మరణం

సారాంశం

అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు

అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. సిన్సినాటి సబర్బ్ ప్రాంతంలోని ఓహియో అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఉదయం నాలుగు మృతదేహాలు ఉండటాన్ని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుల కాల్పుల్లో వీరు మరణించినట్లుగా ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరి మరణం పట్ల స్థానిక సిక్కు పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..