అమెరికాలో 4గురు ఆంధ్రుల అనుమానాస్పద మృతి

By telugu team  |  First Published Jun 16, 2019, 10:28 PM IST

చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు. చంద్రశేఖర్‌ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లు చెబుతున్నారు.


ఐవోవా: అమెరికాలోని ఐవోవా రాష్ట్రంలో దారుణం సంఘటన చోటు చేసుకుంది. నలుగురు తెలుగు వాళ్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్‌ (44), లావణ్య (41), మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు 15, 10 ఏళ్లు ఉంటుంది.

చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు. చంద్రశేఖర్‌ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లు చెబుతున్నారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి శరీరాలపై కూడా బుల్లెట్ గాయాలున్నాయి. 

Latest Videos

click me!