ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

Published : Dec 18, 2018, 12:52 PM IST
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

సారాంశం

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు.  సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు.  సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతులు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్(45), అతని అల్లుడు జునేద్(28), హైదరాబాద్ కి చెందిన రాహత్(35)గా గుర్తించారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్ ల మృతదేహాలు లభ్యం కాగా.. జునేద్ మృతదేహం ఇంకా లభించలేదు. అతని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

కాగా.. తమ జిల్లావాసులు మృతిచెందడం పల్ల మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసి ఆస్ట్రేలియాలో చనిపోయిన తెలంగాణ వాసుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..