హౌడీ మోదీ సభకు హాజరుకాలేకపోతున్నా... తులసి గబ్బర్డ్

By telugu teamFirst Published Sep 20, 2019, 10:14 AM IST
Highlights

ట్రంప్ హాజరుకానున్నారు అనగానే... ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలుచుంటాను అని సవాలు చేసిన తులసి గబ్బర్డ్ కూడా హాజరు కానున్నారు అని ప్రచారం జరిగింది. కాగా... దీనిపై  ఆమె తాజాగా స్పందించారు. తాను మోదీ సభకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. అమెరికా పర్యటనకు వస్తున్న మోదీకి స్వాగతం చెబుతున్నట్లు తెలిపారు.
 

హౌడీ మోదీ సభకు తాను హాజరుకాలేకపోతున్నానని డెమోక్రాట్‌ ప్రతినిధి తులసి గబ్బర్డ్‌ తెలిపారు. అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి, అమెరికా కాంగ్రెస్‌లో మొట్టమొదటి హిందూ సభ్యురాలు తులసి గబ్బర్డ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటన తర్వాత... ఆమెపై అందరి కన్ను పడింది. 

అమెరికాలోని హోస్టన్‌లో జరగనున్న ‘హౌడీ మోదీ’ సభకు సన్నాహాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమెరికాలోని ప్రవాసీలను ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగిస్తారు. తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను, తమ ఆలోచనలను ప్రవాసీలతో పంచుకుంటారు. కాగా.... అమెరికాలోని హోస్టన్ లో నిర్వహించే ఈ సభకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కానున్నారు. 

ట్రంప్ హాజరుకానున్నారు అనగానే... ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలుచుంటాను అని సవాలు చేసిన తులసి గబ్బర్డ్ కూడా హాజరు కానున్నారు అని ప్రచారం జరిగింది. కాగా... దీనిపై  ఆమె తాజాగా స్పందించారు. తాను మోదీ సభకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. అమెరికా పర్యటనకు వస్తున్న మోదీకి స్వాగతం చెబుతున్నట్లు తెలిపారు.

అయితే... ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... ప్రచార కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నట్లు తెలిపారు. ముందుగానే ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేసుకున్నానని... అందుకే మోదీ సభకు హాజరుకాలేకపోతున్నట్లు వివరణ ఇచ్చారు. మోదీ సభకు భారతీయులు ఎక్కువ మంది హాజరుకావాలని తాను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

భారత్- అమెరికా బంధం గురించి చెబుతూ తానువసుధైక కుటుంబం అనే సూత్రాన్ని పాటిస్తానని ఆమె తెలిపారు. భారత్- అమెరికా ఇరు దేశాల మధ్యబలమైన భాగస్వామ్యాన్ని తాను పెంచుతానని చెప్పారు. అంతేకాకుండా ఇరు దేశాలకు సంబంధించి సంపద పెంచడానికి, సైన్స్ , ఆరోగ్యం, పర్యావరణం, భద్రత, ఉగ్రవాదానికి వ్యతరేకంగా పోరాడటం లాంటి విషయాలపై దృష్టిపెడతామని చెప్పారు. భూగ్రహం మీద ఉన్నవారంతా ఒకే కుటుంబం అని... వసుదైక కుటుంబం లా ఉండాలని ఆమె పేర్కొన్నారు.  అప్పుడు ప్రపంచంలో ద్వేషం, మూర్ఖత్వం, అజ్ఞానం, పక్షపాతానికి ఎక్కడా చోటు ఉండదని ఆమె పేర్కొన్నారు.

click me!