అదరగొట్టిన షియోమీ: ఫెస్టివ్ సీజన్ లో 25 శాతం పెరిగిన సేల్స్

By narsimha lodeFirst Published Oct 6, 2019, 11:54 AM IST
Highlights

చైనాకు చెందిన షియామీ భారత్ లో రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లను విక్రయించింది. 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్​ ఫోన్ తయారీ దిగ్గజం షియోమీ ప్రస్తుత పండుగ సీజన్​లో రికార్డు స్థాయి అమ్మకాలు సాధించింది. దసరా ముందు నిర్వహించిన ప్రత్యేక సేల్​ ద్వారా మొత్తం 53 లక్షల డివైస్​లు విక్రయించినట్లు శనివారం వెల్లడించింది. వీటిలో మొత్తం 38 లక్షల స్మార్ట్​ఫోన్లు ఉన్నట్లు తెలిపింది.

గతేడాది ఇదే పండుగ సీజన్​తో పోలిస్తే 25 శాతం అమ్మకాలు పెరిగినట్లు షియోమీ పేర్కొంది. 2018లో ఈ సంస్థ మొత్తం 25 లక్షల స్మార్ట్​ఫోన్​లు విక్రయించింది. ఈ పండుగ సీజన్​లో షియోమీ భారీ అమ్మకాలు సాధించింది. మొత్తం 53 లక్షల డివైస్​లు (38 లక్షల స్మార్ట్​ఫోన్లు) విక్రయమయ్యాయి. 

‘ఈ కామర్స్​ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లలో రెడ్​ మీ నోట్​ 7 ఉత్తమ సెల్లింగ్​ స్మార్ట్​ ఫోన్​గా నిలిచింది. మొత్తం మీద ఈ సీజన్​లో సెకనుకు 535 డివైస్​​ల చొప్పున అమ్ముడయ్యాయి’ అని షియోమీ ఇండియా ఆన్​లైన్​ సేల్స్ అధిపతి రఘు రెడ్డి చెప్పారు. 

ఎంఐ డాట్​కామ్​ సహా ఇతర ఈ కామర్స్​ భాగస్వాములతో కలిపి షియోమీ సంస్థ.. స్మార్ట్​ ఫోన్లు, ఎంఐటీవీ, ఎంఐ బ్యాండ్​, ఎంఐ పవర్​బ్యాంక్​లు, ఎంఐ ఇయర్​ఫోన్స్​, ఎంఐ ఇకోసిస్టమ్​ డివైస్​​ల వంటి ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను విక్రయించింది.

click me!