ఐఓఎస్ 8 కంటే పాత వర్షన్‌పై ఫిబ్రవరి నుంచి వాట్సాప్‌ నో వర్కింగ్!

Siva Kodati |  
Published : Sep 29, 2019, 12:24 PM IST
ఐఓఎస్ 8 కంటే పాత వర్షన్‌పై ఫిబ్రవరి నుంచి వాట్సాప్‌ నో వర్కింగ్!

సారాంశం

పాతకాలం నాటి ఆండ్రాయిడ్ ఐఓఎస్ 8 వర్షన్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదు. ఒకవేళ వాట్సాప్ సేవలను అందుకోవాలంటే ఐఓఎస్ వర్షన్లను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్‌ పనిచేయడానికి చివరి రోజు. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ పనిచేయడం ఆగిపోతుంది. అయ్యబాబోయ్‌ అదేంటి మా ఖాతాలు ఏమవుతాయి? అని కంగారు పడకండి. ఇది కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే సుమా! 

కొన్ని ఆపిల్‌ ఫోన్లలోనూ కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ ఆ రోజునుంచి వాట్సాప్‌ ఇక పని చేయదు. మీ ఫోన్‌ కచ్చితంగా అందులో ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే - ఐఓఎస్ 8 గానీ అంతకంటే పాత వెర్షన్‌ గానీ వాడే ఆపిల్‌ ఫోన్లలో  ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్‌ సపోర్ట్ చేయదు. 

అలాగే ఆండ్రాయిడ్‌ మాటకు వస్తే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.7 గానీ అంతకు ముందు వెర్షన్లు గానీ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. కనీసం యాండ్రాయిడ్‌ 3.0 అయినా లేని పాత ఫోన్‌ అయితే తప్ప మీరేం కంగారుపడనక్కరలేదు. 

ఐ ఫోన్‌ వినియోగదారులు తమ ఫోన్లో కనీసం ఐఓఎస్ వెర్షన్‌ 9.0 ఉన్నా ఈ వార్త గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఇన్ని వెర్షన్లు అప్‌గ్రేడయినా ఇప్పటికీ పాతకాలం ఫోన్లనే పట్టుకు కూర్చుంటామనేవాళ్లు మాత్రం వాట్సాప్‌ని తప్పనిసరిగా త్యాగం చేయాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే