విపణిలోకి శామ్‌సంగ్ మిడ్ రేంజ్ ఎ30ఎస్ ప్లస్ ఎ50ఎస్ ఫోన్లు

By narsimha lode  |  First Published Sep 12, 2019, 2:15 PM IST

శామ్ సంగ్ కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫ్‌లైన్,ఆన్‌లైన్ లలో ఈ ఫోన్లను విక్రయించనున్నట్టుగా శామ్ సంగ్ ప్రకటించింది.


న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల మేజర్ ‘శామ్‌సంగ్’ తన ఎ సిరీస్‌లో రెండు నూతన ఫోన్లను విపణిలోకి తెచ్చింది. ఇంతకుముందు మార్కెట్లోకి విడుదల చేసిన ఎ50, ఎ30 మోడల్ ఫోన్లకు కొన్ని మార్పులతో ఎ50ఎస్, ఎ30ఎస్ వేరియంట్లుగా అందుబాటులోకి తెచ్చింది. ఎ50ఎస్, ఎ30ఎస్ స్మార్ట్ ఫోన్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో శామ్ సంగ్ ప్రకటించింది.

శామ్‌సంగ్ ఎ50ఎస్ 4జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.22,999గానూ, 6 జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.24,999గానూ నిర్నయించింది. కేవలం 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర మాత్రం రూ.16,999గా నిర్ణయించింది. 

Latest Videos

undefined

ఈ రెండు ఫోన్లు ప్రిజమ్ క్రష్ వైలెట్, ప్రిజమ్ క్రష్ బ్లాక్, ప్రిజమ్ క్రష్ వైట్ రంగుల్లో లభిస్తాయని శామ్‌సంగ్ పేర్కొంది. అమెజాన్, ప్లిప్ కార్ట్, పేటీఎం మాల్, శామ్‌సంగ్ ఆన్ లైన్ మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రిటైల్ స్టోర్లలో తక్షణం అందుబాటులో ఉన్నాయని వివరించింది. 

రెండు ఫోన్లలో 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. అవి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. రెండు ఫోన్లలో ఎన్ఎఫ్‌సీ, ఇన్‌డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

6.4 అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ ఇన్ఫినిటీ ‘యూ’ సూపర్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9పై శామ్‌సంగ్ వన్ యూఐతో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో ఎక్జినోస్ 9611 ప్రాసెసర్‌ను వినియోగించారు. బ్యాకప్ ట్రిపుల్ కెమెరా ఉంది. 48+8+5 ఎంపీల కెమెరాలను ఇందులో అమర్చారు. ఇంకా ఫ్రంట్ 32 ఎంపీల కెమెరా ఉంది. 

శామ్‌సంగ్ వన్ యూఐతోపాటు ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‍తో పని చేసే శామ్ సంగ్ ఎ30ఎస్ ఫోన్ 6.4 హెచ్ డీ+ ఇన్ఫినిటీ ‘వీ’ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో బ్యాకప్ 25+8+5 ఎంపీ కెమెరాలను అమర్చారు. ఫ్రంట్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 

click me!