శ్వేత జాతీయ- వేర్పాటువాదం నాట్ ఓకే: ఫేస్ బుక్ వార్నింగ్

By Siva KodatiFirst Published Mar 29, 2019, 10:21 AM IST
Highlights

శ్వేత జాతీయవాదం,  వేర్పాటు వాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని సోషల్ మీడియా వేదిక ‘ఫేస్ బుక్’ సంచలన నిర్ణయం తీసుకున్నది. జాతి విద్వేషం,  జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలపై పూర్తిగా నిషేధం విధిస్తూ ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వచ్చేవారం నుంచి అమలులోకి రానున్నది

శ్వేత జాతీయ వాదం (వైట్స్) పేరిట ద్వేషపూరిత వాతావరణాన్ని రేకెత్తించడాన్ని ఎంత మాత్రమూ సహించబోమని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ హెచ్చరించింది. ఇక శ్వేత జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎంత మాత్రం సహించనని స్పష‍్టం చేసింది.

అలాగే ఎలాంటి జాతి విద్వేషాన్ని, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను తమ ప్లాట్‌ఫాంపై అనుమతించబోమని వెల్లడించింది. వచ్చేవారం నుండి అమలు కానున్న ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌కు కూడా వర్తిస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

వ్యక్తులు, సంస్థలు ఫేస్‌బుక్‌తో తమ వ్యవస్థ, జాతి గొప్పతనం గురించి ప్రకటనలు చేయవచ్చు గానీ ఇవి మరొకరిని కించపరచకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు తీవ్రవాద గ్రూపుల సమాచారాన్ని గుర్తించి బ్లాక్ చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంటామని వివరించింది.

అలాగే వేర్పాటువాద సంస్థల గురించి శోధించే ఖాతాదారుల సమాచారాన్ని టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు అందిస్తామని కూడా  ఫేస్‌బుక్‌ వెల్లడించింది. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌ మసీద్‌లో శ్వేత జాతి ఉన్మాది సృష్టించిన మారణహోమంపై స్పందించిన ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

50 మందిని పొట్టనబెట్టుకున్న ఈ కాల్పులను ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. దీనిపై న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ కూడా ఆగ్రహావ వ్యక్తం చేశారు కూడా. 

ఈ పరిణామాలపై నెలకొన్న ఒత్తిడి నేపథ్యంలో స్పందించిన ఫేస్‌బుక్‌ 24 గంటల్లో 12 లక్షల వీడియోలను బ్లాక్ చేయడంతోపాటు మూడు లక్షల వీడియోల అప్‌లోడింగ్‌ను నిరోధించామని కూడా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. 

ఏబీఎన్‌ ఆమ్రో - స్టేటర్‌లో ఇన్ఫోసిస్‌కు 75% వాటా
ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంకు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్టేటర్‌లో 75 శాతం వాటాను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.989 కోట్లు (127.5 మిలియన్‌ యూరోలు) చెల్లించనుంది.

ఈ విషయమైఇరు సంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. 1997లో వ్యవస్థాపితమైన స్టేటర్‌.. ప్రస్తుతం నెదర్లాండ్స్‌, బెల్జియం, జర్మనీలో తనఖా నిర్వహణ సేవలను అందిస్తోంది. 

మెజారిటీ వాటా కొనుగోలు చేసినా ప్రస్తుత యాజమాన్య నిర్వహణలోనే స్టేటర్
ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా స్టేటర్‌లో 75 శాతం వాటా ఇన్ఫోసిస్‌ చేతికి వెళ్లనుండగా.. మిగిలిన 25 శాతం ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంక్‌ వద్దే ఉంటుంది. నియంత్రణపరమైన అనుమతులు లభిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కొనుగోలు లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. కొనుగోలు తర్వాత కూడా స్టేటర్‌లో ప్రస్తుత యాజమాన్యమే కొనసాగుతుందని తెలిపింది.

click me!