తండ్రి కోరికను గుర్తుచేసుకుని వేదికపై ఏడ్చేసిన ఏపీ మంత్రి

By Rekulapally SaichandFirst Published Dec 25, 2019, 11:08 AM IST
Highlights

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లురు జిల్లాలోని  తన సొంత గ్రామంలో తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి పర్యటించారు.  ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లురు జిల్లాలోని   సొంత గ్రామంలో తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి పర్యటించారు.  ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు  చేసిన   సభా వేదికపైనా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతుకుముందు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ఎమోషన్ అయ్యారు. 

తన సొంత గ్రామంలో చెరువు నిర్మాణం పూర్తి చేసి అది నీళ్లతో కలకలాడుతూ ఉంటే చూడాలని ఉందంటూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి  భావోద్వేగంతో ప్రసంగించారు. మూడేళ్లలో  సోమశిల హై లెవల్ ప్రాజెక్ట్  పూర్తిచేసి గ్రామాల చేరువులను నింపాలని కోరారు. చేరువులలో నీళ్ళు ఉంటే  వలసలు అగి ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెడుతుతారని దానికి సహకరించాలని ఆయన  అధికారులకు విజ్ఞప్తిచేశారు.

అపంతరం  మాట్లాడి గౌతమ్ రెడ్డి . తన తండ్రి కోరికను గుర్తుచేసుకుని  కాస్త కళ్లు చెమర్చారు. కొంచెం ఎమోషన్ అయి ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోయారు. దీంతో గమనించిన వ్యక్తిగత సిబ్బంది నీళ్లు అందించారు.వాటిని తాగి  కాస్త తెరుకొని తన తండ్రి రాజమోహన్ రెడ్డి కోరికను  తప్పకుండా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చెరువును నింపుతామని అక్కడ ప్రజలు మాట ఇచ్చారు.
 

click me!