దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..

By Asianet NewsFirst Published May 3, 2023, 7:46 AM IST
Highlights

తమిళనాడులో దారుణం జరిగింది. ఐదుగురు బాలికలపై నలుగురు బాలులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు.  ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తమిళనాడులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన సమాజం తలదించుకునేలా చేస్తోంది. ఐదుగురు చిన్నారులను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో నిందితులందరూ మైనర్లే కావడం ఆందోళనకరం.

వార్నీ.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేసిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది. జానకీపూరం సమీపంలో నివసించే ఓ చిన్నారి రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి వయస్సు రెండు సంవత్సరాలు. ప్రతీ రోజు ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లేది. ఇలా వెళ్తున్న క్రమంలో ఒక రోజు ఒక్క సారిగా అనారోగ్యానికి గురైంది. ఏం జరిగిందని మహిళా టీచర్ బాలికను ఆరా తీసింది. దీంతో బాలిక లైంగిక దాడికి గురైందని టీచర్ గుర్తించింది.

అన్ని రాష్ట్రాల విద్యార్థులు సమానమే.. కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లో ఉండాల్సిందే - స్టాలిన్

ఈ విషయాన్ని ఆమె ఆ జిల్లా బాలల భద్రతాధికారికి తెలియజేసింది. ఆ ఆఫీసర్ అక్కడికి చేరుకొని బాధితురాలని ముండియంబాక్కం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో బాలిక నివసించే ప్రాంతంలోనే ఉండే 14-17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నలుగురు మైనర్లు లైంగిక దాడికి ఒడిగట్టినట్టు బహిర్గతమైంది.

బజరంగ్ పూనియా ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు - బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన ఆరోపణలు

ఈ విచారణలో మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితులు ఒక్క బాలికపైనే కాకుండా మరో నలుగురు బాలికపైనే ఇలాగే అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలింది. అలాగే బాధితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోందని ‘ఈనాడు’ పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నలుగురు బాలులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 
 

click me!