Thank You Movie: థాంక్యూ  మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే సేఫ్

Published : Jul 22, 2022, 02:29 PM IST
Thank You Movie: థాంక్యూ  మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే సేఫ్

సారాంశం

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ నేడు విడుదలైంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా మూవీకి మిక్స్డ్ టాక్ అందుతుంది. ఈ క్రమంలో థ్యాంక్ యూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది. ఎన్ని కోట్లు వస్తే హిట్ స్టేటస్ అందుకుంటుందో చూద్దాం  

నాగ చైతన్య(Naga Chaitanya) వరుస విజయాలతో ఊపు మీద ఉన్నారు. ఆయన గత చిత్రాలు లవ్ స్టోరీ, బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ మూవీ థాంక్యూ  మూవీపై అంచనాలు పెరిగాయి. దీనికి కాంబినేషన్ కూడా ఒక కారణం. గతంలో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కలిసి చేసిన మనం మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ క్రమంలో థాంక్యూ   చిత్రానికి భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 8 కోట్లకు నైజాం హక్కులు పలికినట్లు సమాచారం అందుతుండగా... సీడెడ్ రూ. 2.50 కోట్లు, ఆంధ్రా రూ. 9.50 కోట్లకు అమ్మారట. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.5 కోట్లు, ఓవర్ సీస్ రూ. 2.50 కోట్లకు విక్రయించారని సమాచారం. మొత్తంగా థాంక్యూ  మూవీ రూ. 24 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ జరిపింది. కాబట్టి రూ. 25 కోట్లు రాబడితే థాంక్యూ(Thank You)  మూవీ హిట్ కొట్టినట్లు అవుతుంది. మరి నాగ చైతన్య ఈ టార్గెట్ ఎంత మేరకు చేరుకుంటాడో చూడాలి. 

ఈ మధ్య టైర్ టూ హీరోల చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నాని నటించిన అంటే సుందరానికీ, గోపి చంద్ పక్కా కమర్షియల్, రామ్ పోతినేని వారియర్ నష్టాలు మిగిల్చాయి. అంటే సుందరానికీ, ది వారియర్ అయితే పది కోట్లకు పైగా నష్టపోయాయి. ఈ క్రమంలో నాగ చైతన్య ఎంత మేరకు రాణిస్తాడనే ఆసక్తి నెలకొంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న థాంక్యూ   మూవీలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?