ఇరుగు పొరుగు పేరు మీద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ ఇతర భాషా కవుల కవితలను తెలుగులో అందిస్తున్నారు తాజాగా ఆయన ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూ కవితకు తెలుగు అనువాదం అందించారు.
నా దుఖం, నిశ్శబ్ద సంగీతం
నా ఉనికి, పేరు లేని అణువు
నా దుఃఖానికి మాటలొస్తే
నా పేరేమిటో నేనెక్కడివాణ్ణో
నాకు తెలిసేది
నా ఉనికి ఆనవాళ్ళు నాకు తెలిస్తే
ఈ లోకపు రహస్యం నాకు తెలిసేది
నేనా రహస్యాన్ని గనుక తెలుసుకోగలిగితే
నా మౌనానికి ఓ ఉచ్ఛారణ లభించేది
నేనీ విశ్వానికి యజమానిని అయ్యేవాణ్ని
నాకీ రెండు లోకాల సంపదా లబించేది
- తెలుగు అనువాదం: వారాల ఆనంద్