స్మార్ట్ ఫోన్ల ఉచ్చులో ఎవరికి వారు తమ తమ సొంత ఇంటిలోనే తప్పిపోయిన దృశ్యాన్ని దాసరి మోహన్ తన కవిత 'వర్చువల్ హాపినేస్' లో కళ్ళముందు ఎలా ఆవిష్కరించారో చదవండి.
నీతి మాటల మూటలు
మొబైల్ డాటా నింపేసింది
జవహర్ డంపింగ్ యార్డ్ సరిపోదేమో
అంతా అన్ లైన్ లో నే
ఆయుధాలు అయిన మొబైల్స్
ఛార్జింగ్ చేసుకోవడం ఇక వంతుల వారిగా
కట్టి పడేసినా
కవి సమ్మేళనం ఆగ డం లేదు
జూమ్ దేవో భవ
కార్బన్ మోనాక్సైడ్ బాధ తప్పింది...
ఒక నెట్ వుంటే చాలు
వైరస్ లు వంద వచ్చినా
కరిగి పారేస్తా రోజుల్ని
మున్సిపాలిటీ కుళాయి నీటిలా...
ఒకరు రిపీట్ సీరియల్ లో
మరొకరు టిక్ టాక్ వుచ్చులో
సొంత ఇంటిలోనే తప్పిపోయారు అందరూ..
వలపులన్నీ లాంగ్ లీవ్
స్మాల్ స్క్రీన్ మీదే సిలిపి తనమంతా
వర్చువల్ హాపినెస్ ఆవరించింది అంతా
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature