అస్నాల శ్రీనివాస్ తెలుగు కవిత: ఈ రోజు

By telugu team  |  First Published May 11, 2020, 11:21 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తెలుగు కవులు కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆస్నాల శ్రీనివాస్ తన కవిత ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.


సరిహద్దులను చేరిపేస్తూ
ఆసేతు హిమాచల
జన తరంగ తురంగా
కదన కుతూహలం

విషపు కరోనా 
విస్తరణ ధిక్కరిస్తూ
జనకవాతు యుద్ధగీతం

Latest Videos

యుద్ధసారధులకు
జన జేజేల సంకల్ప 
చప్పట్ల సంగీతం

నిర్మలమైన నీలాకాశం
పక్షుల కూజితాల
వసంతోత్సవం .
ప్రకృతి పరవశంతో 
తానావిర్భవించిన నాటి 
విమల వేడుకల కోలాహలం

భయాన్ని జయిస్తూ 
ద్వేషాన్ని దహిస్తూ
వేరుగా ఉండడంలో
ఏకాంతాన్ని అనుభవిస్తూ
భీభత్స,జ్వరామరణాలను 
అధిగమిస్తూ పునరుద్భవ జీవనం

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!