తెలుగు సాహితీ దిగ్గజం కేకేఆర్ ఇక లేరు

By telugu teamFirst Published May 15, 2021, 6:38 PM IST
Highlights

తెలుగు సాహితీ శిఖరం ఆచార్య కేకే రంగనాథాచార్యులు కన్నుమూశారు. దీంతో తెలుగు సాహితీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది. కేకేఆర్ తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్: ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకులు,సాహిత్య చరిత్రకారులు, హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు కే. కే. రంగనాధాచార్యులు (80) కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ నాచారం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా తో కన్నుమూశారు.  

ఆయన ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులకు సంపాదకత్వం వహించారు.  బహుముఖం, తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక, పరిచయాలు - ప్రస్తావనలు వీరి ఇతర రచనలు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎందురో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

మిత భా‌షి, మృదు స్వభావంగల వీరి మృతికి తెలుగు సాహితీ లోకం నివాళులు అర్పిస్తుంది. విలక్షణ సాహిత్య కారుడు, పరిశోధకులు అయిన కేకేఆర్ కు  తెలుగు సాహిత్యంలో చాలా మంది శిష్యులు ఉన్నారు. కేకేఆర్ మృతి తెలుగు సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది.

click me!