బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఒక రోజంతా సాహిత్య సభలను నిర్వహిస్తోంది. ఇది మూడు విభాగాలుగా ఉండనుంది.
రేపు అనగా 24-3-2024 ఆదివారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉదయం 10గంటలకు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఒక రోజంతా సాహిత్య సభలను మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నది.
మొదట ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ సభలను ప్రారంభిస్తారు. తర్వాత కవి కందుకూరి శ్రీరాములు రాసిన ' పలకల నుంచి పలుకుల వైపు ' కవితా సంపుటిని ముఖ్య అతిథి శివారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథులుగా నందిని సిద్ధారెడ్డి , దేశపతి శ్రీనివాస్, ఆత్మీయ అతిథులుగా నాళేశ్వరం శంకరం, విరహత్ అలీ పాల్గొని ప్రసంగిస్తారు. వివిధ జిల్లా శాఖల తెరసం అధ్యక్షులు కొత్త అనిల్ కుమార్, పొట్లపల్లి శ్రీనివాస్, బిల్లా మహేందర్, పానుగంటి రామ్మూర్తి , ముత్తిగారి కవిత, పొన్నాల బాలయ్య, గణపురం దేవేందర్ సందేశాలు ఇస్తారు. కొండపల్లి నిహారిణి ఆహ్వానంపలుకగా బెల్లంకొండ సంపత్ కుమార్ కార్యదర్శి నివేదికను సమర్పిస్తారు.
రెండో విభాగంలో ' సాహిత్యం సమకాలీనత ' అంశంలో కవిత్వం మీద దర్భశయనం శ్రీనివాసాచార్య , కథ- నవల మీద ఎన్ .రజని, విమర్శ -పరిశోధన మీద లక్ష్మణ చక్రవర్తి ప్రసంగిస్తారు. వి శంకర్, రూప్ కుమార్ డబ్బీకార్, తూర్పు మల్లారెడ్డి సభలకు అధ్యక్షత వహిస్తారు.
మూడో విభాగంలో 38 కవులు పాల్గొంటున్న కవిసమ్మేళనానికి గండ్ర లక్ష్మణరావు అధ్యక్షతవహిస్తారు. ఇందులో కందాళై రాఘవాచార్య,వేణుశ్రీ, అహోబిలం ప్రభాకర్ , తిరునగరిశ్రీనివాస్ , ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, దేవనపల్లి వీణావాణి, దాసరిమోహన్ , ధూళిపాళ అరుణ, గజేందర్ రెడ్డి , నరేశ్ చారి, నల్లగొండ రమేశ్ మొదలైన వారు పాల్గొంటారని తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.