సిరికోన పొయెట్రీ అవార్డు– 2020 విజేత స్వాతి శ్రీపాద :

By telugu teamFirst Published Dec 9, 2020, 2:33 PM IST
Highlights

సున్నితమైన భావవ్యక్తీకరణ, అందులోని ప్రతీకాత్మకత, ఆ భావాల్లో ధ్వనించే అనుభూతి సాంద్రత, వాటి సార్వత్రికత, ప్రతి కవితలో ధ్వనించే నవ్యత - వీటిని ప్రధానంగా పరిగణిస్తూ సిరికోన పోయెట్రీ అవార్డును  స్వాతి శ్రీపాదకు ప్రకటిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు

కాలిఫోర్నియా సిలికాన్ తో పాటు,  ఇతర ప్రాంతాలలోనూ, దేశాలలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న సాహిత్య మిత్రులు, సామాజిక మాధ్యమంలో ఒక ప్రయోగంగా  నెలకొల్పుకొన్న వాట్సప్ సాహిత్య దినపత్రిక  'సాహితీ సిరికోన'.ఇందులో  ఉత్తమ కవిత్వాన్ని ప్రోత్సహించి, సత్కరించడానికి గాను  'సిరికోన పొయెట్రీ అవార్డు'  నెలకొల్పారు.. ఈ అవార్డు విలువ రూ.25000 /-లు.
 
సిరికోన స్థాపక మిత్రులు, శ్రీ వేణు ఆసూరి  తమ తల్లి స్మృత్యంకితంగా ఈ అవార్డును గత ఏడాది నుండి అందిస్తున్నారు.గత ఏడాది  తొలి అవార్డు "నీలమోహనం" కావ్యానికి గాను మధురకవి, శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి లభించింది.      
       
ఇది  కేవలం నగదు పురస్కారం  కాదు . ప్రచురణ సహిత పురస్కారం.  సుమారు వందపేజీల కవితా సంపుటిని, 500 ప్రతులు ముద్రించి, కవికి సమర్పించడం జరుగుతుంది. ముద్రణ వ్యయం పోనూ మిగిలిన మొత్తం, సముచిత సత్కారంతో పాటు, కవికి పుస్తకావిష్కరణ సభలో బహూకరించబడుతుంది. 
 
సున్నితమైన భావవ్యక్తీకరణ, అందులోని ప్రతీకాత్మకత, ఆ భావాల్లో ధ్వనించే అనుభూతి సాంద్రత, వాటి సార్వత్రికత, ప్రతి కవితలో ధ్వనించే నవ్యత - వీటిని ప్రధానంగా పరిగణిస్తూ ఈ అవార్డునుస్వాతి శ్రీపాదకి ప్రకటిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.

click me!