శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ - పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ - 2022

By Bukka Sumabala  |  First Published Sep 16, 2022, 12:07 PM IST

సమాజంలో మంచిని పెంచడం, మానవీయ భావనల్ని ప్రోది చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న కథల పోటీ ఇది. వస్తుశిల్పాల్లో వైవిధ్యం చూపిన కథలకు ప్రాధాన్యం లభిస్తుంది. పాఠకులలో హృదయ సంస్కారం పాదుకోడానికి తోడ్పడే కథారచనని ప్రోత్సహించే లక్ష్యంతో తలపెట్టిన ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.


బహుమతులు
మొదటి బహుమతి : రూ. 10,000
రెండో బహుమతి : రూ. 5,000
మూడో బహుమతి : రూ. 3,000
ఏడు కథలకు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1,000
 
నిబంధనలు :
- జీవితం విశాలమైంది. మనిషి జీవితం అనేక అనుభవాల సమాహారం. కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. ఎంచుకున్న ఇతివృత్తాన్ని కథగా మలచడంలో చూపిన కౌశలానికే ప్రాధాన్యం.

-  ఏం చెప్పారన్నదే కాక ఎలా చెప్పారన్నదే ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత సుందరంగా, రమణీయంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా వ్యక్తం చేశారన్నదే కీలకం.

Latest Videos

- పోటీకి పంపించే  కథలకు ఎలాంటి పేజీల పరిమితి లేదు. తాము చెప్పదలచుకున్న కథని ఎన్ని పేజీలలో చెబుతారనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అందుకే పేజీలకు సంబంధించి ఎలాంటి పరిధులు, పరిమితులు లేవు.

- పోటీకి పంపించే కథలు సొంత కథలై ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.

- కవర్‌ మీద శ్రీమక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌`పాలపిట్ట కథలపోటీ-2022కి అని రాయాలి.  పోటీ నిమిత్తం పంపించే కథలు తిప్పి పంపడం సాధ్యం కాదు.

- కథల ఎంపిక విషయంలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు, సంప్రదింపులకు తావు లేదు.

- ఈ పోటీలో ఎంపిక చేసే కథలని పాలపిట్టలో ప్రచురించడంతోపాటు భవిష్యత్తులో తీసుకురానున్న కథల సంకలనాలలోనూ ముద్రించడానికి అంగీకరించేవారు మాత్రమే ఈ పోటీలకు కథలని పంపించాలి.

మీ కథలు చేరడానికి చివరితేదీ - 20 అక్టోబర్‌ 2022
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.

చిరునామాః ఎడిటర్‌, పాలపిట్ట
ఎఫ్‌-2, బ్లాక్‌ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 94900 99327
Email: palapittamag@gmail.com

click me!