సంబరాజు రవి ప్రకాశ రావు కవిత : గాలిపటం తెగలేదు

Published : Nov 09, 2021, 12:47 PM IST
సంబరాజు రవి ప్రకాశ రావు కవిత : గాలిపటం తెగలేదు

సారాంశం

విలువల కోసమే సిద్ధమైన త్యాగాన్ని ఇప్పుడు మీరూ ఆలింగనం చేసుకోవాల్సిందే అంటూ వర్తమాన రాజకీయాలను సంబరాజు రవి ప్రకాశ రావు తన "గాలిపటం తెగలేదు" కవితలో ఎలా వ్యక్తీకరించారో చదవండి: 

తెగ బోతున్న గాలిపటం ఎవరిదో 
మీ అనుభూతి లోకి వచ్చి ఉంటుంది 
పయనం గాలివాటం కాదని జ్ఞాన నేత్రం గ్రహించే
                                                          ఉంటుంది
రెక్కలు రాల్చుకుంటున్న గులాబీ రోదన
మీ కర్ణేంద్రియాలకు వినపడే ఉంటుంది
విలువలను ఎవరు తాకట్టు పెడుతున్నారో
కర్ణాకర్ణిగా ఇప్పటికే మీరు వినే ఉంటారు
విలువల కోసమే సిద్ధమైన త్యాగాన్ని 
ఇప్పుడు మీరూ ఆలింగనం చేసుకోవాల్సిందే
నమ్ముకున్న సిద్ధాంతమే నట్టేట ముంచినప్పుడు రంగులు లెక్కలోకి రావు 
అయినా మన పిచ్చి గానీ 
రంగులు మారని వాడు ఎవడు?
జనమే జెండా , అజెండా అయినప్పుడు 
ఒంటరి అనే మాట 
ఆమడ దూరంలో ఉంటుంది
బహుశా ఫలితం
రాత్రంతా నీకు పీడకలే అయి ఉంటుంది
మొదలైన పతనాన్ని
ఆపే మంత్ర దండం
నీ చేతిలో ఉంది 
అప్పుడో ఇప్పుడో 
కాస్త ఉపయోగించు 
లేకుంటే వర్తమానమే
నీ భవిష్యత్తు అవుతుంది...

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం