నేడు గాంధీ జయంతి సందర్భంగా సీనియర్ కవి రేడియమ్ కవిత ' ఉవాచ' ఇక్కడ చదవండి.
గాంధీ జయంతి
మూడుయాభైలరెండు
సిద్ధాంతం పదిలం
రూకపైబొమ్మ
విలువ ఇచ్చారమ్మ
అహింసా కిరణం
మూడు కోతులు
వన్నెతగ్గని కథ
లోతైన భావం
ఉప్పుపై పన్ను
సాగరమైన పోరు
గెలుపు దారి
స్వచ్ఛత స్వేచ్ఛ
ప్రగతి నయనాలు
ప్రేమ ఉవాచ.