రాజమండ్రిలో జాతీయ సదస్సు... నల్గొండ బిడ్డలకు ఆహ్వానం

By Arun Kumar P  |  First Published Feb 2, 2023, 12:25 PM IST

నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాజమండ్రిలో జరిగే జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. 


హైదరాబాద్ : నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన భారతీయ భాషా సంస్థ, రాజమండ్రిలోని  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో రాజమండ్రిలో జాతీయ సదస్సు ఏర్పాటుచేసారు. ఈ జాతీయ సదస్సుకు నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన పరిశోధకులు డాక్టర్ మండల స్వామి, సాగర్ల సత్తయ్యలకు ఆహ్వానం అందింది. 

చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, పాఠ్యపుస్తక రచయిత సాగర్ల సత్తయ్య ఈ సదస్సులో 'శివ కవులు - చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం' అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.  ఫిబ్రవరి 3న ఈ కార్యక్రమం జరగనుంది. 

Latest Videos

undefined

ఇక ఇదే చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ మండల స్వామి ' నల్లగొండ జిల్లా గ్రామ నామాలు ' అనే అంశంపై పరిశోధన చేశారు.  ఈ సదస్సులో ప్రాచీన గ్రామ నామాలు చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.  ఇది  ఫిబ్రవరి 4న వుండనుంది.

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు మండలానికి చెందిన పరిశోధకులు ఎంపిక కావడం పట్ల పలు సాహిత్య సంస్థలు,  పలువురు సాహిత్యాభిమానులు అభినందనలు తెలిపారు. నల్గొండ బిడ్డలకు జాతీయ సదస్సు ఆహ్వానం అందడం జిల్లాకే గర్వకారణమని చిట్యాల ప్రజలు అంటున్నారు. 

click me!