సాహిత్య వార్తలు: సాహిత్య విమర్శ, పరిశోధనా వ్యాసాల పోటీ

By telugu teamFirst Published Aug 15, 2021, 8:58 AM IST
Highlights

సాహిత్య, విమర్శ, పరిశోధనకు సంబంధించిన వ్యాసాల పోటీ నిర్వహించాలని ‘పాలపిట్ట’ సలహా మండలి సంకల్పించింది. చాలామంది కథల, కవితల  పోటీలు నిర్వహిస్తుంటారు. బహుమతులు ఇస్తుంటారు. కానీ సాహిత్యవ్యాసాల పోటీ అరుదు. 

తెలుగు సాహిత్యరంగంలో కవిత్వం, కథలు, నవలలు వస్తున్నంత విస్తృతంగా విమర్శ రావడం లేదు. సమగ్రమైన, పరిపూర్ణమైన విమర్శ వ్యాసాలు బహు తక్కువ. అలాగే సాహిత్య పరిశోధనా వ్యాసాలు కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాహిత్య, విమర్శ, పరిశోధనకు సంబంధించిన వ్యాసాల పోటీ నిర్వహించాలని ‘పాలపిట్ట’ సలహా మండలి సంకల్పించింది. చాలామంది కథల, కవితల  పోటీలు నిర్వహిస్తుంటారు. బహుమతులు ఇస్తుంటారు. కానీ సాహిత్యవ్యాసాల పోటీ అరుదు. 

విమర్శకు పురస్కారాలు ఇచ్చేవారు తక్కువ. కనుకనే చక్కని వచనం రాసే సాహిత్య పరిశోధకులకు, విద్యార్థులకు, విమర్శకులకు ప్రోత్సాహకరంగా ఉండాలనే ఉద్దేశంతో ‘సాహిత్య విమర్శ, పరిశోధనా వ్యాసాల పోటీ’ని నిర్వ‌హించాల‌ని పాలపిట్ట తలపెట్టింది.  క‌నుక సాహిత్య పరిశోధకులు, విమర్శకులు, సాహిత్యాన్ని బోధించే అధ్యాపకులు, సాహిత్యాన్ని గురించి వ్యాసాలు రాసేవారు పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.

వ్యాసాలు పంపించ‌డానికి గ‌డువు చివ‌రి తేదీః 31 ఆగ‌స్టు 2021
బహుమతుల వివరాలు
మొదటి బహుమతి: రూ. 5000
రెండో బహుమతి: రూ. 3000
మూడో బహుమతి: రూ. 2000
ఇవి గాక సాధారణ ప్రచురణకు అర్హమయినవిగా ఎంపిక చేసే ప్రతి వ్యాసానికి రూ. 1000 చొప్పున పారితోషికం ఉంటుంది.

ఎంట్రీ ఫీజు: రూ. 500
ఈ పోటీలో పాల్గొనదలచిన వారు వ్యాసంతో పాటు రూ. 500 ఎంట్రీఫీజుగా పంపించాలి. ఒకవేళ ఎవరయినా ఒకటి కన్నా మించిన వ్యాసాలు పోటీకి పంపదలచుకుంటే అదనంగా ప్రతి వ్యాసానికి రూ. 500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి.   palapittabooks payble at Hyderabad పేరుతో డి.డి. పంపించాలి. లేదా పాలపిట్ట బుక్స్‌ అకౌంట్‌కు డబ్బు బదిలీ చేయాలి. అకౌంట్‌ వివరాలు:
AC.Name: palapitta books
a.c. no. 79008621912
Telangana Grameena bank
Nallakunta branch
hyderabad. Ifsc code: sbin0rrdcgb
 
నియమ నిబంధనలు:

- తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశం మీదయినా విమర్శ, పరిశోధన వ్యాసాలు పోటీకి పంపవచ్చు.

- ఒక పుస్తకం మీద రాసే సమీక్షలు, వ్యాసాలు పోటీకి స్వీకరించబడవు.

- సాహిత్యంలోని విభిన్న ధోరణుల మీద రాసే వ్యాసాలు పరిశీలనకు అర్హమైనవి.

- కథ, కవిత, నవల, నాటకం వంటి ఏ ప్రక్రియల మీదయినా వ్యాసాలు రాసి పంపవచ్చు.

- ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక సాహిత్యధోరణుల గురించి విపులమైన, పరిశోధనాత్మకమైన వ్యాసాలు పంపించండి. భాషకు సంబంధించిన అంశాలపై కూడా పరిశోధనాత్మక, విమర్శనాత్మక వ్యాసాలు పంపించండి.  

- పోటీకి పంపే వ్యాసాలు ఇదివరలో ఎక్కడా ప్రచురితమై, ప్రసారమై ఉండకూడదు. సోషల్‌మీడియా గ్రూపుల్లోనూ పోస్టు చేసి ఉండరాదు. పోటీకి పంపించే వ్యాసాలను తిప్పి పంపడం కుదరు. కనుక ఒక కాపీని రచయితలు తమ దగ్గర ఉంచుకోవాలి.

- ఈ పోటీలో ఎంపికయ్యే వ్యాసాలను పాలపిట్ట పత్రికలోనూ, మున్ముందు తీసుకువచ్చే వ్యాస సంకలనాల్లోనూ ప్రచురిస్తాం.

పోటీకి వ్యాసాలు పంపించడానికి చివరి తేదీ: 31 ఆగస్టు 2021
చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట
ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌`6, ఏపిహెచ్‌బి,
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌`500 044
ఫోను: 040`2767 8430, సెల్‌: 9848787284
ఈమెయిల్‌:  palapittamag@gmail.com

click me!