కొలిమికి భరోసా కావాలి అంటూ దాసోజు కృష్ణమాచారి కవిత రాశారు ఆయన కవితలో కులవృత్తికి సంబంధించిన అంశం ఉంది. తెలుగు సాహిత్యంలో అదో పాయగా కొనసాగుతోంది.
రాష్ట్రమంతా బతుకమ్మ ను
ఎత్తుకోని తిరుగుతుంది
ఉత్పత్తి వృత్తి శవాన్ని
మెసుకు తీర్గుతుంది
గంజి నీళ్ళుయినా తాగి బతుకుదామంటే
బంగారం సిగ్గు దీసై
ద్రావకం ధూప తీరిసింది..
పెయ్యికేసిన జంజం పోగుల గూడును
యే చెట్టుకు ఎలాడదియ్యను
నిలువ నీడ లేక
భూమిల రాసుకున్న!!
వృత్తి అంటరానిదైందని
మీ రాతి బండల మీద
శిలాఫలకాన్ని చేసి చేక్కమంటారా..?
రండి హస్తిపంజరాన్ని పంచనామా చేసి
ఇది బంగారు తెలంగాణ అని
ఇది బంగారు బతుకమ్మ అని
ఎర్ర తివాచీ పరిచి మ్యూజియం లో పెట్టుకోండి
అయినా ఉత్పత్తి ఎముకనయి అడుగుతున్నా ?
కోలిమికి భరోసా కావాలి!!
కలల గూడుకు అసరా కావాలి.
- దాసోజు కృష్ణమాచారి