హైకూలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకాళహస్తి నుండి కయ్యూరు బాలసుబ్రమణ్యం రాసిన కొన్ని ఆసక్తికరమైన హైకూలను ఇక్కడ చదవండి.
హైకూలు
నిత్యం ఎగిరే
ఆకాశ విహంగాలు
నా ఆలోచనలు
తేనె సంతకం
నా మనో ఫలకంపై
నీ నయనాలు
తామర మోముపై
చక్కని బుగ్గచుక్క
హేమంత ఋతువు
కలవలేని
భగ్న హృదయాలు
రైలు పట్టాలు