ఇరుగు పొరుగు: రూపి కౌర్ మరి కొన్ని కవితలు

Published : Jun 22, 2021, 06:23 PM IST
ఇరుగు పొరుగు: రూపి కౌర్ మరి కొన్ని కవితలు

సారాంశం

ఇరుగు పొరుగు కింద రూపీ కౌర్ కవితలను కొన్నింటిని ప్రముఖ కవి వారాల ఆనంద్ తెలుగులో అందించారు. వాటిని ఇక్కడ చదవండి.

నువ్వు నీ ఏకాంతం తో 
ప్రేమలో పడు
      *           *
నేను నీటిని 
ప్రాణాన్ని ఇచ్చేంత 
మెత్తని దాన్ని
నీటిలో ముంచేసే
కఠినమయినదాన్ని కూడా
      *               *
ప్రేమ క్రూరమయింది కాదు 
మనమే కౄరులం
ప్రేమ ఒక ఆట కాదు 
మనమే ప్రేమలోంచి 
ఓ ఆటను సృష్టించాం 
        *               *
నా నాలుక చేదుగా వుంది 
నిన్ను కోల్పోయిన ఆకలితో 
        *               *
మనం నిజాయితీగా మొదలయ్యాం 
దాన్ని నిజాయితీగానే ముగిద్దాం 
        *               *
మనుషులు వెళ్ళిపోతారు 
కానీ 
ఎట్లా వెళ్లి పోయారన్నది 
ఎప్పటికీ వుండిపోతుంది 

    ఆంగ్ల మూలం : రూపి కౌర్ 
(‘milk and honey’ new york times best seller)తెలుగు : వారాల ఆనంద్ 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం