డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన'అడుగులు'కథా సంపుటి ఆవిష్కరణ

By telugu team  |  First Published Nov 22, 2020, 10:48 AM IST

డాక్టర్ దేవేంద్ర రచించిన అడుగులు కథా సంపుటిని రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.


సింహప్రసాద్  సాహిత్య సాహిత్య సమితి ఆధ్వర్యంలో డాక్టర్ మారోజు దేవేంద్ర రచించిన అడుగులు కథాసంపుటి  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ఆవిష్కరించారు.. సభలో ఈ గ్రంథాన్ని తొలి బీసీ కమిషన్ చైర్మన్ చైర్మన్ బి.ఎస్.రాములుకు అంకితం ఇచ్చారు. ఈ సభకు ఆత్మీయ అతిథులుగా సీనియర్ కథకులు వాణిశ్రీ, విహారి, ప్రముఖ కవి డాక్టర్ పత్తిపాక మోహన్  పాల్గొన్నారు.

ఇదే సభలో అడుగులు కథా సంపుటికి 2020 కిగాను డాక్టర్ వేదగిరి రాంబాబు యువ కథానిక పురస్కారాన్ని, ఐదు వేల రూపాయల నగదును సింహ ప్రసాద్ అందజేశారు. న్యాయనిర్ణేతగా విహారి వ్యవహరించారు. కె.వి.రమణాచారి మాట్లాడుతూ ఈ పురస్కారంతో ప్రతిభాశాలి అయిన యువ రచయిత్రి దేవేంద్ర కు మరింత సాహిత్యం పట్ల భాద్యత పెరిగిందని, భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆశీర్వదించారు.

Latest Videos

బిఎస్ రాములు మాట్లాడుతూ దేవేంద్ర ఈతరం రచయిత్రి అని అని కొనియాడారు. డాక్టర్ పత్తిపాక మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

click me!