డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ హైకూలు రాశారు. హైకూలకు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. అవి చిట్టి కవితలే అయినా రూపం విశిష్టమైంది. భీంపల్లి శ్రీకాంత్ హైకూలు ఇక్కడ ఇస్తున్నాం.
వానచినుకు
నేలను ముద్దాడింది
నవ్విన పంట
పక్షుల గుంపు
ఆకాశంలో విహారం
లోకసంచారం
నింగిచుక్కలు
నేలచుట్టూ వెన్నెల
చీకట్లో కాంతి
చెరువు కొప్పు
బతుకమ్మ సింగిడి
పల్లె వెలుగు
చీకటి రాత్రి
నక్షత్రాల ప్రయాణం
నింగిలో ఈత
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature