బండి నారాయణ స్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

By telugu team  |  First Published Dec 18, 2019, 5:49 PM IST

ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్రను ప్రజల కోణం నుంచి రాసిన నవలగా శప్తభూమిని తీర్చిదిద్దారు.


న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2019 సంవత్సరానికి గాను ఆయన రాసిన శప్తభోూమి అనే నవలకు ప్రతిష్టాత్మకమైన ఆ వార్షిక పురస్కారం లభించింది. 

రాయలసీమ చరిత్ర ఆధారంగా నారాయణ స్వామి శప్తభూమి నవల రాశారు. రాయల కాలం తర్వాత దాదాపు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి ప్రజా జీవితం ఈ నవలలో ప్రతిబంబించింది. హేండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలూకార్పణ్యాల మధ్య నలిగిగిన ప్రజల జీవితాు, పాలెగాళ్ల దౌర్జన్యాలకు ఈ నవలలో చిత్రిక కట్టారు. దానికి తానా 2017లో బహుమతి కూడా లభించింది. 

Latest Videos

undefined

బండి నారాయణస్వామి రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన వారు. ఆయన 1952 జూన్ 3వ తేీదన ్నంతపురం పాతర ఊరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. 

నారాయణస్వామి బిఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నలబై దాకా కథలు రాసిన ఆయన వీరగల్లు కథా సంపుటి వెలువరించారు. గద్దలాడ్తాండాయి, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం మొదలైన నవలలు రాశారు. 

click me!