మెర్సీ మార్గరేట్ రచించిన "డియర్ జిందగీ" పుస్తకాన్ని సోమవారం సాయంత్రం ఆరు గంటలకు, రవీంద్ర భారతిలోని, కాన్ఫరెన్స్ హాల్ లో మెర్సీ తండ్రి మోహనబాబు ఆవిష్కరించారు.
మెర్సీ మార్గరెట్ రాసిన ఈ "డియర్ జిందగీ" తన వ్యక్తి గతం కాదు సామూహిక స్వరం అని, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖలు అమ్మి పెడతాం అంటే మెర్సీ రాసిన ఈ డియర్ జిందగీ పుస్తకాన్ని రెఫర్ చేస్తాననీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం "డియర్ జిందగీ" అని పుస్తక ఆవిష్కరణ సభలో జూలూరు గౌరీశంకర్ అన్నారు. మెర్సీ మార్గరేట్ రచించిన "డియర్ జిందగీ" పుస్తకాన్ని సోమవారం సాయంత్రం ఆరు గంటలకు, రవీంద్ర భారతిలోని, కాన్ఫరెన్స్ హాల్ లో మెర్సీ తండ్రి మోహనబాబు ఆవిష్కరించారు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ మెర్సీ మార్గరెట్ రాసిన ఈ డియర్ జిందగీ ప్రతి ఒక్కరినీ తమ జీవితం తామే చూసుకోమని ఎదురు నిలిచే పుస్తకం అనీ.. కోల్పోయిన జీవితాన్ని వెతుక్కోవడంలో మెర్సీ చూపిన సాహిత్య అన్వేషణ అన్నారు.
ఆచార్య కోయి కోటేశ్వర రావు గారు అధ్యక్షులుగా చాలా చక్కగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవలం యువతరం మాత్రమే కాదు తాత్విక అన్వేషణ ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం డియర్ జిందగీ అని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ అన్నారు. విమర్శకుడు ఆదిత్య కొర్రపాటి మాట్లాడుతూ మెర్సీ రాసిన డియర్ జిందగీ పుస్తకం తెలుగు సాహిత్యానికి తన వంతు నగిషీ దిద్దెలా తీసుకు వచ్చారనీ చాలా చక్కటి కవితాత్మక తాత్విక భూమిక ఈ పుస్తకం అన్నారు.
మదన్ మోహన్ రెడ్డి , హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మాట్లాడుతూ మెర్సీ మార్గరెట్ రాసిన ఈ పుస్తకం యువతరం అందరూ చదవాల్సిన పుస్తకమనీ, ఎన్నో మేటఫర్స్ తో ఇమేజరీస్ తో కవితలకు తగ్గకుండా ఈ లేఖలు ఉన్నాయి అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయిన జాన్ కే జోసెఫ్ తన సంగీతంతో పాటలతో ఆహుతులకు వినోదం పంచటమే కాకుండా "డియర్ జిందగీ" పుస్తక ఆవిష్కరణ మూడ్ లోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళారు.