నియంత ఖైదు చేసినా దేశ జనం గుండెనిండా
ఒకే జెండా ఎగురుతుంది అంటూ అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత " జెండా " ఇక్కడ చదవండి :
సముద్రాలు వేరు చేసినా చల్లగాలి ఒకటి చేస్తుంది ఎడారులు వేరు చేసినా ఆకాశం ఒకటి చేస్తుంది పర్వతాలు వేరు చేసినా నదీ ప్రవాహం ఒకటి చేస్తుంది నియంత ఖైదు చేసినా నినాదం ఒకటి చేస్తుంది దేశ జనం గుండెనిండా ఒకే జెండా ఎగురుతుంది