జలపాతం వద్ద సెల్పీ ప్రయత్నం... నీటమునిగి యువకుడి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Jun 15, 2020, 07:40 PM ISTUpdated : Jun 16, 2020, 03:27 PM IST
జలపాతం వద్ద సెల్పీ ప్రయత్నం... నీటమునిగి యువకుడి మృతి

సారాంశం

నలుగురు యువకులు సెల్ఫీ మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  లాక్ డౌన్ కారణంగా కాలేజికి సెలవు వుండటంతో సరదాగా జలపాతం చూడటానికి వెళ్లిన యువకుల సెల్పీ మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోదారవరిఖనికి చెందిన ఆవుల యశ్వంత్(22) డిప్లోమా చదువుతున్నాడు. అయితే  ప్రస్తుతం కాలేజీ బంధ్ వుండటంతో ఇంటివద్దే వున్నాడు. ఈ క్రమంలో ప్రెండ్స్ తో కలిసి సరదాగా సబ్బితం జలపాతాన్ని చూడటానికి వెళ్లాడు. 

అయితే అక్కడికి వెళ్లాక యువకులందరు ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్పీలు తీసుకోవడం ప్రారంభించారు. ఇలా బాగా లోతుగా వున్న నీటికుంట వద్ద ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కాలుజారి యశ్వంత్ నీటిలో పడిపోయాడు. బయటకు రావడం సాధ్యంకాక నీటమునిగి మృత్యువాతపడ్డాడు.  

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు