పెళ్లిచూపులకు వెళుతుండగా... కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : May 11, 2020, 12:35 PM ISTUpdated : May 11, 2020, 12:45 PM IST
పెళ్లిచూపులకు వెళుతుండగా... కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

పెళ్లిచూసుల కోసం వెళుతున్న ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి గురయిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల జిల్లా కొండగట్టు క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండలం ముస్కాని పేట నుండి జగిత్యాలకు ఓ కుటుంబం పెళ్లి చూపుల కోసం కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలవగా  అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముస్కానిపేటకు చెందిన కొండయ్య తన కుటుంబంతో కలిసి పెళ్లిచూపుల కోసం బయలుదేరాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతూ లారీని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురయ్యింది. కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.  

ప్రమాదం జరిగిన వెంటనే స్ధానికలు గాయపడిన వారందరిని స్థానికంగా వున్న ఓ హాస్పిటల్ కు తరలించారు. దీంతో వారికి మెరుగైన చికిత్స అందించడంతో ఇద్దరు ప్రాణాపాయ స్ధితి నుండి బయటపడగా ఒకరి పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే వుంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు