తెలంగాణ రాష్ట్రంలో కేవలం మద్యం అమ్మకాల ద్వారానే కాదు మద్యం దుకాణాల ఏర్పాటుకోసం వచ్చిన దరఖాస్తుల ద్వారా కూడా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాప్స్ దక్కించుకునేందుకు వ్యాపారులు ఎగబడ్డారు.
కరీంనగర్: తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. దరఖాస్తులకు చివరిరోజైన నిన్న(బుధవారం) భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుంది.
జగిత్యాల జిల్లా జిల్లా వ్యాప్తంగా మొత్తం 64 మద్యం దుకాణాలకు 1285 టెండర్లు(దరఖాస్తులు) నమోదయ్యాయి. ఆయా ఆబ్కారీ స్టేషన్ ల పరిధిలో ఉన్న మొత్తం షాపుల కోసం వచ్చిన దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 25.70 కోట్లుగా వుంది.
undefined
సర్కిల్లవారిగా చూసుకుంటే జగిత్యాలలో 27షాపులకు 457 టెండర్లు, ధర్మపురిలో 16 షాపులకు 364 టెండర్లు, మెట్ పల్లిలో 21 షాపులకు464 టెండర్లు నమోదయ్యాయి. అత్యధికంగా మెట్ పల్లి మండలం రాఘవపేట్ మల్లపూర్ పరిధిలోని వైన్ షాప్ కు 48 టెండర్లు దాఖలయ్యాయి. ఒక్కో దరఖాస్తు రుసుం గతంలో లక్ష రూపాయలు ఉండగా ఈ సారి రెండు లక్షలకు పెంచారు. అయినప్పటికి వ్యాపారులు వెనక్కి తగ్గలేదు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 74 మద్యం దుకాణాలకు 734 దరఖాస్తులు వచ్చాయి. సర్కిళ్లవారిగా చూస్తూ పెద్దపల్లిలో 19 మద్యం దుకాణాలకు 183 దరఖాస్తులు, సుల్తానాబాద్ లో 14 దుకాణాలకు 206 దరఖాస్తులు, రామగుండం లో27 దుకాణాలకు 197 దరఖాస్తులు, మంథని లో14 దుకాణాలకు 148 దరఖాస్తులు వచ్చాయి.
కరీంనగర్ జిల్లా 87 షాపులకు మొత్తం 1346 దరఖాస్తులు వచ్చాయి. వీటిద్వారా రూ. 26 కోట్ల 92 లక్షలు ఆదాయం వచ్చినట్లు సమాచారం. గతంలో 89 షాపులకు కేవలం 10 కోట్ల84 లక్షలు మాత్రమే రాగా ఈసారి అది రెట్టిపయ్యింది.