కరీంనగర్‌లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్థం

By Siva Kodati  |  First Published Oct 7, 2019, 3:17 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సీఎం ఇంట్లో పాళెర్లా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ నిర్ణయాలు నియంతలాగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగులను తొలగిస్తామని అప్రజాస్వామికమని.. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధమైనదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు సరైనవి కావని.. కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శేఖర్ డిమాండ్ చేశారు.

Latest Videos

undefined

ఆర్టీసీని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలని.. సమ్మె చేయడం వారి నైతిక హక్కని, సమ్మె గురించి ముఖ్యమంత్రి తెలియకుండా మాట్లాడుతున్నారని శేఖర్ ఎద్దేవా చేశారు.

గ్రాంట్ ఇవ్వకుండా, బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా, రాయితీలు కల్పించకుండా ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని శేఖర్ మండిపడ్డారు. సెప్టెంబర్ నెల వేతనాలు ఇంతవరకు ఆర్టీసీ కార్మికులకు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో సీఐటీయూ అనుబంధ సంఘాలు పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి ఎడ్ల రమేష్, కమిటీ సభ్యులు పున్నం రవి, మల్లయ్య, శ్రీనువాష్, రాజయ్య, రమేష్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

click me!