ప్రగతి భవన్ ముట్టడి... కరీంనగర్ జిల్లాలో భారీగా అరెస్టులు

By Arun Kumar P  |  First Published Oct 21, 2019, 5:05 PM IST

ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ  అరెస్టయ్యారు. నిరసన తెలిపేందుకు హైదరాబాద్ కు బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెెస్టులు చేశారు.   


తెలంగాణ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రగతిభవన్ ముట్టడి కోసం హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ క్రమంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. కొందరు సీనియర్ నాయకులను ముందస్తుగానే గృహనిర్భందం విధించిన పోలీసులు మరికొందరిని పట్టణంలో, హైదరాబాద్ కు వెళ్లే మార్గాల్లో అరెస్ట్ లు చేసి  పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

పెద్దపల్లి పట్టణం నుండి ప్రగతిభవనం ముట్టడికి బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ,యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు మంథని నర్సింగ్,  దొడ్డుపల్లి జగదీష్ తో పాటు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని పెద్దపల్లి పోలీస్టేషన్ కు తరలించారు. 

Latest Videos

undefined

 

చలో ప్రగతి భవన్ ముట్టడి భాగంగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాష్ట్ర పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్,  యూత్  కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహ్మాన్, శ్రీనివాస్,  బిసి సెల్ రాజు, వసీం యూత్ కాంగ్రెస్ నాయకులుహరీష్, సతీష్ మాజీ కార్పొరేటర్  తిరుపతి, మైనార్టీ సెల్ వసీం కలీం, సర్వే ఇమ్రాన్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలను 3 టౌన్ పోలీసులు  అరెస్ట్ చేశారు.   

కరీంనగర్ పట్టణం నుండిప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరాల్సి వున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల కు సంఘీభావంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు బయలేదేరిన చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. 

ఆయనతో పాటు చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పద్మాకర్ రెడ్డి , గంగాధర మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్,వన్నారం ఎంపిటిసి జావ్వాజి హరిష్, బట్టు లక్ష్మీనారాయణ, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి,  పైడి పల్లి శ్రీనివాస్ , ఆకుల అజయ్, పుల్కం నరసయ్య , తిరుపతి రెడ్డి,నేరేళ్ళ పరుశురాం తదితరులు కూడా అరెస్టయ్యారు.

అర్టీసీ కార్మికులు గత 16 రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి చేపట్టారు. ఈ కక్రమంలోనే ప్రగతిభవన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగిన ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

 

 

click me!