దోపిడీ కేసు: 35 ఏళ్ల తర్వాత నిందితుడి పట్టివేత

By telugu teamFirst Published Jan 29, 2020, 4:08 PM IST
Highlights

35 ఏళ క్రితంనాటి దోపిడీ కేసును గన్నేరువరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడైన భూమయ్యను పోలీసులు 35 ఏళ్ల తర్వాత పట్టుకోగలిగారు. అతన్ని పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

కరీంనగర్: ఓ దోపిడీ కేసులో నిందితుడు గత 35 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు దేశమంతా గాలిస్తూనే ఉన్ారు. చివరకు అతన్ని బుధవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాోని గన్నేరువరం ఎస్ఐ తిరుపతి వెల్లడించారు.

గన్నేరువరం పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి....  ప్రస్తుత గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జరిగిన ఒక దోపిడి కేసులోనిందితుడిగా ఉండి తప్పించుక తిరుగుతున్న వేముల భూమయ్యను పోలీసులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన నిందితుడు వేముల భూమయ్య గత 35 ఏళ్లుగా  తప్పించుకుని తిరుగుతూ పలుజిల్లాల్లో పనిచేశాడు. 

ఇటీవలఅతను తన స్వగ్రామం భీంగల్ కు వచ్చి ఉంటున్నట్లు సమాచారం గన్నేరువరం పోలీస్ స్టేషన్ సమాచారం అందింది. దీంతో వారెంట్లు/సమన్లు అమలు చేసే బృందానికి చెందిన కానిస్టేబుళ్ళు టి కొమురయ్య, ఎ సంపత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి రహస్యంగా సమాచారం సేకరించారు.

ఆ  తర్వాత నిందితుడు వేముల భూమయ్యకు వారెంటును అమలు చేసి గన్నేరువరం పోలీస్ స్టేషన్ కుతీసుకవచ్చారు. అతడిని సదరు కేసు గురించి విచారించిన అనంతరం గురువారం నాడు కరీంనగర్ కోర్టులోహాజరు పరిచామని ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు

అభినందించిన పోలీస్ కమీషనర్

గత 35 సంవత్సరాలుగా నాన్ బేలబుల్ వారెంట్ జారీ అయి తప్పించుక తిరుగుతున్న నిందితుడు భూమయ్యను అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరుచారు. ఇందులో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుళ్ళు కొమురయ్య, సంపత్ లతోపాటు గన్నేరువరం ఎస్ఐ తిరుపతిలను కరీంనగర్పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. వారికి రివార్డులను ప్రకటించారు.

click me!