ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు

By Siva KodatiFirst Published Jan 26, 2020, 4:35 PM IST
Highlights

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్ పోలీస్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్ పోలీస్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 

 

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా కేదారి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాలకులు వారికి అనుగుణంగా మలుచుకొని కొన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేదారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ భారత ప్రజలు, మేధావులు  కృషి చేయక పోతే ప్రజా  స్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంబటి జోజిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. 

 

హుస్నాబాద్‌ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మామిడి తిరుపతి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో  కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్, నాయకులు వీరయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

click me!