గుడ్ న్యూస్: బీటెక్‌ అర్హతతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం వెంటనే ధరఖాస్తు చేసుకోండీ

By S Ashok Kumar  |  First Published Apr 21, 2021, 6:24 PM IST

ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.   
 


బీటెక్‌  పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సి) ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను కోరుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 27 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Latest Videos

undefined

మొత్తం పోస్టుల సంఖ్య: 215

ఖాళీ విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

also read స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి.. ...

వయసు: అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎస్‌సి, ఎస్‌టి, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.
 

ధరఖాస్తులకు చివరితేదీ: 27 ఏప్రిల్‌ 2021

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 18 జులై 2021

అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

click me!