ఇంటర్ చదివే వారికి గుడ్ న్యూస్. 10+2 అర్హతతో ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది.
ఇండియన్ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021 ఆగస్టు బ్యాచ్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది.
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
మొత్తం ఖాళీలు: 2500
ఆర్టిఫిషర్ అప్రెంటీస్– 500
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ – 2000
1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ): 500
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్‌ఎస్‌ఆర్)–2000
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.215. ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26 ఏప్రిల్ 2021
చివరి తేది: 30 ఏప్రిల్ 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.joinindiannavy.gov.in/