జూమ్ కాల్ లో భర్త బిజీ... భార్య వెనక నుంచి నగ్నంగా..

By telugu news teamFirst Published Apr 5, 2021, 7:59 AM IST
Highlights

ఓ పొలిటీషియన్ జూమ్ మీటింగ్ లో బిజీగా ఉండగా... ఆయన భార్య నగ్నంగా ఆయన వెనక రావడం గమనార్హం.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాంటివారైనా తమ మీటింగ్స్ ఆన్ లైన్ లో కొనసాగిస్తున్నారు. బయట అందరూ కలిసి మాట్లాడుకునే విధంగా పరిస్థితులు లేవు. దీంతో.. జూమ్ యాప్ ద్వారా మీటింగ్స్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ పొలిటీషియన్ జూమ్ మీటింగ్ లో బిజీగా ఉండగా... ఆయన భార్య నగ్నంగా ఆయన వెనక రావడం గమనార్హం. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ప్రముఖ రాజకీయ నేత పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా కరోనా వ్యాప్తి, మరణాలపై అధ్యయనం పై వీడియో కాల్ లో చర్చిస్తున్నారు. కొద్దిసేపటికి ఆయన భార్య ఒంటిమీద నూలుపోగు లేకుండా వచ్చి వెనుక నిల్చుంది. ఆవలివైపు సమావేశంలోని ప్రతినిధులు అవాక్కయ్యారు. తన వెనుక భార్య నగ్నంగా నిల్చున్నదనే సంగతి తెలియని ఆ నేత, జోరుగా చర్చలో మునిగిపోయారు. 

‘అందరూ చూస్తున్నారు. సమావేశంలో ఉన్నారనే విషయాన్ని మీరు ఆమెకు చెప్పలేదా?’ అంటూ ఓ ప్రతినిధి చెప్పడంతో ఆ నేత వెనక్కు తిరిగారు. న్యూడ్‌గా భార్య కనిపించే సరికి నోరెళ్ల బెట్టారు! సౌతాఫ్రికాలో ఇటీవల గ్జోలిలే డేవు అనే నేతకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆ నేత సిగ్గుతో రెండు చేతులను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు. తర్వాత సమావేశ ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు.
 

click me!