Viral News: స‌ర‌దాగా ముగిసిన‌ విహారయాత్ర‌.. ఇంటికెళ్లి బ్యాగ్ తెరిచి చూసి కంగుతున్న మ‌హిళ‌.. 

By Rajesh K  |  First Published Jul 31, 2022, 7:18 PM IST

Viral News: ఆస్ట్రియన్ మహిళ త‌న సెల‌వుల్లో క్రొయేషియా కు వెళ్లివ‌చ్చిన త‌రువాత‌.. ఊహించ‌ని సంఘ‌ట‌న‌ను ఎదుర్కొంది. ఆమె బ్యాగ్ తెరిచినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. మహిళ సంచిలో ఒక ఆడ తేలుతో పాటు  17 తేలు పిల్లలను గుర్తించింది. 


Viral News: సెలవుల్లో విహారయాత్రకు వెళ్లేందుకు ఎవరు ఇష్టపడరు? ప్రతి ఒక్కరూ త‌మ కుటుంబంతో గానీ, ఒంటరిగా గానీ విహారయాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. చాలా సరదా గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. ఆ విహార యాత్ర‌లో పొందిన‌  ఉత్సాహ‌న్నిత‌మ నిత్య జీవితంలోనూ కొన‌సాగించాల‌ని భావిస్తారు. కానీ.. ఓ ఆస్ట్రియన్ మహిళ జీవితంలో అనుకోని సంఘ‌ట‌న ఎదురైంది. ఆమె త‌న సెలవుదినాల‌ను ఎంతో సంతోషంగా గ‌డిపి ఇంటికి చేరుకుంది. అనంత‌రం.. ఆమె త‌న సూట్ కేసును ఓపెన్  చేసి.. చూస్తే.. ఒక్క‌సారిగా కంగుతిన్న‌ది. ఆమె సూట్‌కేస్ నుంచి ఒక్క‌సారిగా తేళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 తేళ్లు బయటకు వచ్చాయి. ఇంత ప్రమాదకరమైన ఘ‌ట‌న ఆస్ట్రియన్ చెందిన ఓ మహిళకు ఎదురైంది.  

న్యూస్‌వీక్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రియన్ లోని నాటర్న్‌బాచ్‌కు చెందిన ఓ మహిళ త‌న సెల‌వుల్లో క్రొయేషియా ను సందర్శించి ఇంటికి తిరిగి వచ్చింది. అనంత‌రం త‌న ఆమె బ్యాగ్ తెరిచినప్పుడు.. ఆమె భ‌యాందోళ‌న‌కు గురైంది. ఆ మహిళ  బ్యాగులో ఒక ఆడ తేలుతో స‌హా దాని17 పిల్లలు కనిపించాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ వెంటనే యానిమల్ రెస్క్యూ సర్వీస్ టైర్‌హిల్ఫ్ గుసెంటల్‌ను సంప్రదించి, వాటిని తొలగించాల్సిందిగా కోరింది. 

Latest Videos

ఈ విష‌యం టియర్‌హిల్ఫ్ గుసెంటల్ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. ఆ పోస్ట్ లో అధికారులు ఇలా రాసుకోచ్చారు.  “ఈ సాయంత్రం నాటర్న్‌బాచ్‌కి చెందిన ఒక మహిళ మమ్మల్ని సంప్రదించింది. ఆమె క్రొయేషియా పర్యటన నుండి తిరిగి వ‌చ్చాక తన బ్యాగ్‌లో తేళ్లు,దాని  పిల్లలను గుర్తించింది. ఆ తేళ్లు రక్షించబడ్డాయి. మేము ఆ తేళ్ల‌ను సురక్షితంగా క్రొయేషియాకు పంపబోతున్నాం . అని పోస్టు చేశారు.

 న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. క్రొయేషియా స్కార్పియన్స్ అన్ని ప‌రిస్థితుల్లో సులభంగా పెరుగుతాయని యానిమల్ కంట్రోల్ సిబ్బంది చెప్పారు. ఆస్ట్రియాలో క్రొయేషియన్ స్కార్పియన్స్ కనుగొనడం ఇదే మొదటిసారి కాదనీ, ఈ ఏడాది జూన్ 30న ఒక మహిళ లిన్స్ నగరంలోని తన అపార్ట్‌మెంట్‌లో ప‌దుల సంఖ్య‌లో తేళ్ల‌ను గుర్తించిన‌ట్టు తెలిపారు. ఆమె కూడా క్రొయేషియా పర్యటనకు వెళ్ళింది. స్కార్పియన్స్‌లో దాదాపు 2,000 జాతులు ఉన్నాయని, అయితే వీటిలో 30 నుంచి 40 మాత్రమే మనుషులను చంపేంత విషాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. క్రొయేషియాలో కొన్ని రకాల తేళ్లు కుట్టిన‌ప్పుడు.. ఎటువంటి.. ప్రాణాపాయం ఉండ‌ద‌నీ, కేవ‌లం నొప్పి, వాపు, దురద, ఎరుపు ఎక్క‌డం, మంట కలుగుతోంద‌ని వైద్యులు తెలుపుతున్నారు.

click me!