నాకెందుకివ్వరు.. ఆయనకెందుకు ఇచ్చారు: నోబెల్‌పై ట్రంప్ అసహనం

By Siva KodatiFirst Published Sep 24, 2019, 3:43 PM IST
Highlights

తాను శాంతి స్థాపన కోసం ఎంతో చేశానని.. కానీ తనకు నోబెల్ కమిటీ అన్యాయం చేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో ఒబామాకు నోబెల్ ఎందుకిచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

నోబెల్ బహుమతి తనకు దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను శాంతి స్థాపన కోసం ఎంతో చేశానని.. కానీ తనకు నోబెల్ కమిటీ అన్యాయం చేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

2009లో ఒబామాకు నోబెల్ ఎందుకిచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఒబామాను నోబెల్ వరించిందని ఆక్రోశం వ్యక్తం చేశారు.

కాగా.. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు చేపట్టినందుకు గాను 2009వ సంవత్సరానికి గాను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే. 

click me!