
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia)కు మధ్య బీకర దాడి జరుగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా పుతిన్ (putin) సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇరు దేశాల ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరుతోంది. ఇరు దేశాల సైనికులు మృత్యువాత పడుతున్నారు. యుద్ధం ఆపేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలితం ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ కు, రష్యాకు ఆదివారం చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. అయితే మరో సారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ ప్రకటించింది.
ఉక్రెయిన్, రష్యాకు చర్చలు జరుగుతున్న సమయంలో కూడా యుద్దం ఆగలేదు. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉంది. అయితే ఈ దాడుల్లో క్లష్టర్ బాంబు(cluster bomb)లు, వాక్యూమ్ బాంబు (vacuum bomb)లు ఉపయోగించారని ఉక్రెయిన్ తెలిపింది. ఈ విషయాన్ని యూనైటెడ్ స్టేట్స్ లోని ఉక్రెయిన్ రాయబారి వెల్లడించారు. రష్యా చర్యకను మానవ హక్కుల సంఘాలు, వీటిని వివిధ అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి.
రష్యన్ బలగాలు విస్తృతంగా నిషేధించబడిన క్లస్టర్ ఆయుధాలను ఉపయోగించినట్లు కనిపించాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (Amnesty International and Human Rights) తెలిపింది. సాధారణ పౌరులు లోపల ఆశ్రయం పొందుతున్న సమయంలో ఈశాన్య ఉక్రెయిన్‌లోని ప్రీస్కూల్‌పై దాడి చేశారని ఆమ్నెస్టీ ఆరోపించింది. రష్యా తన దేశంపై దాడి కోసం వాక్యూమ్ బాంబ్ అని పిలిచే థర్మోబారిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని యుఎస్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశమైన అనంతరం అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా (Oksana Markarova) మీడియాతో తెలిపారు. ‘‘ వారు ఈ రోజు వాక్యూమ్ బాంబును ఉపయోగించారు. రష్యా ఉక్రెయిన్‌పై చేయాలనుకుంటున్న విధ్వంసం చాలా పెద్దది.’’ అని వ్యాఖ్యానించారు.
వాక్యూమ్ బాంబ్ లేదా థర్మోబారిక్ ఆయుధం అనేది చాలా విధ్వంసకరమైనది. ఇది విస్పోటనం చెందినప్పుడు అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. అయితే ఈ అధిక ఉష్టోగ్రత కోసం చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకుంటుంది. సాధారణంగా సాంప్రదాయిక పేలుడు పదార్ధం కంటే చాలా ఎక్కువ వ్యవధిలో పేలుడు తరంగాన్ని ఇది వెలువరిస్తుంది. మానవ శరీరాలను ఇవి చిన్నాభిన్నం చేయగలవు. అయితే ఉక్రెయిన్‌లో జరిగిన ఘర్షణలో థర్మోబారిక్ ఆయుధాలు ఉపయోగించినట్లు అధికారికంగా నిర్ధారణ లేదు. శనివారం మధ్యాహ్నం ఉక్రేనియన్ సరిహద్దు సమీపంలో రష్యా థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్‌ను దాని బృందం ఒకటి గుర్తించిందని CNN నివేదించింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి (Jen Psaki) ఈ విషయంలో మాట్లాడుతూ తాను నివేదికలను చూశానని, అయితే రష్యా అలాంటి ఆయుధాలను ఉపయోగించినట్లు ధృవీకరణ మాత్రం కాలేదని చెప్పింది. అది నిజమైతే, అది యుద్ధ నేరం అవుతుంది అని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు దీనిని అంచనా వేయగలవని తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వాలని చేసిన అభ్యర్థనలకు వాషింగ్టన్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం స్పందించలేదు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం క్లస్టర్ ఆయుధాల వంటి స్వాభావికమైన, విచక్షణారహిత ఆయుధాలను ఉపయోగించడాన్ని నిషేధిస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. పౌరులను చంపే లేదా గాయపరిచే విచక్షణారహిత దాడులను ప్రారంభించడం యుద్ధ నేరంగా పరిగణలోకి వస్తుందని చెప్పింది.