
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. ఈ భీకర పోరు ప్రారంభమై.. దాదాపు 2 నెలలు గడుస్తున్న.. రష్యా దాడులను మాత్రం ఆపడం లేదు. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఇప్పటికే ఉక్కబిరిబిక్కిరి అయ్యింది. ఈ దాడిలో ఉక్రెయిన్ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఉక్రెయిన్ పై దండయాత్రను ఆపాలని ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా రష్యా ఏ మాత్రం తగ్గడం లేదు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను అలానే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా తమ దేశం రష్యాపై ఆంక్షలు విధించారన్న ప్రతీకారంతో పుతిన్ అనేక దేశాల ప్రముఖులపై నిషేధం విధిస్తున్నారు.
తాజాగా Facebook CEO మార్క్ జుకర్‌బర్గ్, US వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్‌పై రష్యా నిషేధం విధించింది. రష్యాలో వారు ప్రయాణించకుండా నిషేధాన్ని విధించింది. ఆంక్షల్లో భాగంగా అమెరికాకు చెందిన మరో 27మంది రాజకీయ, ఇతర ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రముఖ కంపెనీ సీఈవోలు, 61 మంది కెనడియన్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. వారిపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా ప్రకటించిన బ్లాక్‌లిస్టులో ABC న్యూస్ టెలివిజన్ ప్రెజెంటర్ జార్జ్ స్టెఫానోపౌలోస్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్, రష్యా-కేంద్రీకృత మెడుజా న్యూస్ సైట్ ఎడిటర్ కెవిన్ రోత్‌రాక్ ఉన్నారు. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ , లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ, డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ కాథ్లీన్ హిక్స్‌తో సహా US రక్షణ అధికారులు కూడా జాబితాలో ఉన్నారు. అంతకుముందు రష్యా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. జుకర్‌బర్గ్ మెటా సామ్రాజ్యంలో భాగమైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను రష్యా ఇంతకుముందు నిషేధించింది, వాటిని "ఉగ్రవాద" సంస్థలుగా పేర్కొంది.
గురువారం 57వ రోజులోకి ప్రవేశించిన ఉక్రెయిన్‌పై యుద్ధం నుండి మాస్కోను నిరోధించడానికి యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌తో సహా వివిధ దేశాలు తాజా ఆంక్షలు విధించిన తరువాత రష్యా ప్రయాణ నిషేధం వచ్చింది. బ్రిటన్ గురువారం ఉక్రెయిన్‌లో దురాగతాలకు కారణమైన రష్యన్ మిలిటరీ జనరల్‌లను లక్ష్యంగా చేసుకుని 26 కొత్త ఆంక్షలను విధించింది, అలాగే రష్యన్ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే వ్యక్తులు, వ్యాపారాలపై నిషేధం విధించినట్టు బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ఒక ప్రకటనలో తెలిపారు.