
Pakistan’s Punjab: గర్భిణిపై హత్యాచారం జరిగింది. భర్తను కట్టేసి నిండు గర్భిణి అయిన అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటన గురించి డైలీ పాకిస్తాన్ నివేదించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఓ గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు మొదటగా ఇంట్లోకి ప్రవేశించి గర్భిణి భర్తను కట్టేశారు. అనంతరం ఆమెపై లైంగికదాడి చేశారు. దాడి అనంతరం మహిళ స్వయంగా ఆస్పత్రికి వెళ్లింది. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పంజాబ్ ఐజీపీ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరింది. మహిళలపై జరుగుతున్న నేరాల పరంపరలో ఈ ఘటన పాకిస్తాన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసి, సర్వత్రా ఆగ్రహాన్ని కలిగించింది. గత నెలలో కరాచీలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఫిబ్రవరిలో పంజాబ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అందించిన డేటా ప్రకారం.. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో కుటుంబ గౌరవం పేరుతో మొత్తం 2,439 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అలాగే, 90 మంది హత్యకు గురయ్యారు.
పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (HRCP) ఇటీవలి నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజూ కనీసం 11 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. గత ఆరేళ్లలో (2015-21) పోలీసులకు 22,000 పైగా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయి. గత సంవత్సరం 'గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021' ప్రకారం, లింగ సమానత్వ సూచికలో 156 దేశాలలో పాకిస్తాన్ 153 స్థానంలో ఉంది, అంటే చివరి నాలుగు దేశాలలో, మహిళల హక్కులతో దాని పేలవమైన రికార్డుకు సూచికగా నిలుస్తోంది.
ఇదిలావుండగా, తన భార్యను వేధించడంతోపాటు ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)పై కేసు నమోదైంది. Bengaluruలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం నగరం వెలుపల డిప్యూటేషన్‌లో ఉన్నారు. 2005లో మహిళా పోలీస్ స్టేషన్‌లో తాను ఎస్‌ఐని కలిశానని ఫిర్యాదుదారు తెలిపారు. ఆమె అప్పటి భర్తపై కేసుపెట్టేందుకు వెళ్లగా, అప్పటి భార్య తనపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఎస్‌ఐకి సమన్లు అందాయి. అక్కడ వారి మొదటి సమావేశం తరువాత, ఫిర్యాదుదారు, SI మళ్లీ కలుసుకోవడం కొనసాగించారు. ఆ సమయంలో వారు జీవిత భాగస్వాముల నుండి విడిపోయిన తర్వాత... ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్‌ఐ తనపై శారీరకంగా దాడి చేశాడని, తన 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తన సోదరిని లైంగికంగా వేధించాడని కూడా ఆమె ఆరోపించింది.