హఫీజ్‌ సయీద్‌ ప్రసంగంపై పాక్ నిషేధం

By Siva KodatiFirst Published Mar 8, 2019, 5:40 PM IST
Highlights

ముంబై దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయిద్ ప్రసంగంపై పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌తో ప్రపంచదేశాలు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి

ముంబై దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయిద్ ప్రసంగంపై పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌తో ప్రపంచదేశాలు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

దీంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో పాక్ తన ఉగ్ర మిత్రులపై కొరడా ఝళిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి సహా కొన్ని దేశాలు నిషేధించిన సంస్థలపై పాక్ చర్యలకు దిగింది. అందులో భాగంగా జమాత్ ఉద్ దవాకు చెందిన 120 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

దీనితో పాటు లోహర్‌లోని జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయాన్ని పంజాబ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. కాగా, హఫీజ్ ప్రతి శుక్రవారం సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న జామియా ఖాద్సియా మసీదులో ఉపన్యనిస్తాడు.

తాజా చర్యల్లో భాగంగా దీనిని సైతం పాక్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై హఫీజ్ కోర్టును ఆశ్రయించాడు. అయితే న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. మరోవైపు తనను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి కొట్టివేయాలన్న హఫీజ్ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

click me!