ఇమ్రాన్ దేవుడు పంపిన నాయకుడు: భార్య బుష్రా మనేకా ప్రశంసలు

By Nagaraju TFirst Published Sep 28, 2018, 7:06 PM IST
Highlights

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన సతీమణి బుష్రా మనేకా ప్రశసంల వర్షం కురిపించారు. పాక్ ప్రధానిగా తన భర్త ఎన్నికవడం పాక్‌ ప్రజల అదృష్టమన్నారు. ఇమ్రాన్‌ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా బుష్రా మీడియాతో మాట్లాడారు.

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన సతీమణి బుష్రా మనేకా ప్రశసంల వర్షం కురిపించారు. పాక్ ప్రధానిగా తన భర్త ఎన్నికవడం పాక్‌ ప్రజల అదృష్టమన్నారు. ఇమ్రాన్‌ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా బుష్రా మీడియాతో మాట్లాడారు. పాక్‌ జాతి పిత మహ్మద్‌ అలీ జిన్నా, టర్కీ అధ్యక్షుడు రెసీప్‌ తయ్యీప్‌ ఎర్డోగన్‌ల లాగా తన భర్త ఇమ్రాన్ కూడా గొప్పనాయకుడని కొనియాడారు. 

ఒక జాతి తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసేందుకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాకుండా ఓ నాయకుడిని దేవుడు పంపిస్తాడని అలాంటి నాయకుడే ఇమ్రాన్ అన్నారు. 

మహ్మద్‌ అలీ జిన్నా, ఎర్డోగన్‌ల తర్వాత అలా ప్రజల కోసం జన్మించిన వ్యక్తి ఇమ్రాన్‌ అంటూ పొగిడేశారు. నా దృష్టిలో ఈ ముగ్గరు మాత్రమే నిజమైన నాయకులని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో రాజకీయ నాయకులంతా రాజకీయాలు చేసేందుకు ఆసక్తి చూపుతారని కానీ వీళ్లు అభివృద్ధి కోసం పాటుపడతారంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

 ప్రజా సంక్షేమం కోసమే ఇమ్రాన్‌ ప్రధాని పదవి చేపట్టారన్న బుష్రా తొందర్లోనే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నెలరోజుల్లోనే దేశ స్థితిగతులను మార్చే మంత్ర దండం ఇమ్రాన్ వద్ద లేవని వ్యాఖ్యానించారు. పాక్‌ ప్రజలకు ఇప్పుడే శుభకాలం ప్రారంభమైందన్నారు. ఇమ్రాన్‌ నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుందని కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. 

అయితే 1992లో పాక్‌ క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ సాధించిన తర్వాత విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఇమ్రాన్ ఖాన్ బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఇమ్రాన్ మరో జర్నలిస్టు రేహమ్‌ను(2015లో) రెండో పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. తర్వాత మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకున్నారు. 
 

click me!