పాక్‌ అక్కసు: కర్తార్‌పూర్ ప్రారంభానికి మోడీకి బదులు మన్మోహన్‌కు ఆహ్వానం

By Siva KodatiFirst Published Sep 30, 2019, 5:23 PM IST
Highlights

పాకిస్తాన్ మరోసారి భారత ప్రధాని మోడీ పట్ల అక్కసు వెళ్లగక్కింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధానిని కాకుండా మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. 

పాకిస్తాన్ మరోసారి భారత ప్రధాని మోడీ పట్ల అక్కసు వెళ్లగక్కింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధానిని కాకుండా మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది.

సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ దేవ్ తన జీవితంలో చివరి 18 ఏళ్లు కర్తార్‌పూర్‌లోనే గడిపి, ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు సిక్కులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు.

దేశ విభజనతో ఈ ప్రాంతం పాకిస్తాన్‌ ఆధీనంలోకి వెళ్లడంతో భారత్‌లోని సిక్కులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్-పాకిస్తాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా చేపట్టాయి.

ఈ కారిడార్ ద్వారా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ మసీదుతో పాక్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేస్తారు. రావి నదీతీరంలోని కర్తార్‌పూర్‌కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిస్తుంది.

గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌లో ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ముఖ్యఅతిథిగా మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానిస్తున్నట్లు పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. అతి త్వరలోనే ఆయనకు ఆహ్వానం పత్రికను పంపింస్తామని ఖురేషీ ప్రకటించారు. 

click me!